31, అక్టోబర్ 2017, మంగళవారం

చేవెళ్ల కళాశాల విద్యార్థుల ర్యాలీ

subscribe

తెలుగు వారి కోసం







చేవెళ్ల న్యూస్ :-కేరళలో ఏ. బి.వి.పి. కార్యకర్తల పై జరుకుతున్న వివిధ దాడులను ఖండిస్తూ ఈ రోజు చేవెళ్ల లో వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు A.B.V.P ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు . అదేవిదంగా నవంబర్ 11 న కేరళ రాష్టంలో జరుగుతున్న ర్యాలీ మరియు బహిరంగ సభకు భారీ సంఖ్యలో దేశ నలుమూలల నుండీ పాల్గొనాలని విజయవంతం చేయాలని . చేవెళ్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యార్థుల తో పాటు A.B.V.P కార్యకర్తలు పాల్గొన్నారు ..

Plz subscribe get more local updates



మీరు సహాయం చేస్తే ఎవరెస్ట్ ఎక్కుత


Facebook వీడియోస్ Download చేయండి ఇలా !


మీ వాట్సప్ "ఫాంట్"ను మార్చుకోండి.


వాట్సప్ లో ఈ చిన్న సీక్రెట్ మీకు తెలుసా?


నోటితో చెప్తే టైపింగ్ తెలుగు లో వస్తుది.


ఒక గంటలో 200 లైక్స్ మీ ఫోటో కు.


తెలుగు మెసేజ్ లను చదివి వినిపించే యాప్ మీ కోసం.


మీ ఇంట్లో మీ ఫోన్ దొరకడం లేదా? ఐతే 3 చప్పట్లు కోటండి .





మీరు చెప్పిన విషయం పై మేము వీడియో చేస్తాంమీరు చేయవలసినది
మీ ప్రశ్న ను మా కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి


SUBSCRIBE FOLLOW SHARE LIKE

2, అక్టోబర్ 2017, సోమవారం

మీరు గనక చదవడం మొదలు పెడితే మీ కన్నా బాగా ఎవరు చదవలేరు web desiging coruse

ఓ పిట్ట కథ

నాకు బాగా నచ్చిన పోస్ట్

మీరుకుడా చదవండి

జీవితంలో అర్థం పరమార్థం ఉంటాయి అని ఈ కథ మనకు వివరిస్తుంది. ఓ పిట్ట కథ తప్పక చదవండి అనగనగా ఒక ఊళ్ళో ఒక నది. ఆ నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు. ఆ దారిన వెళుతున్న ఒక చిన్న పిట్ట తనకూ తన పిల్లలకు ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని, మొదటి చెట్టు దగ్గరకు వెళ్లి అడిగింది, "వర్షాకాలం వస్తోంది, నేను నా పిల్లలు ఉండటానికి నీ కొమ్మ మీద గూడు కట్టుకోనా?" అంది. "వద్దు ", అనేసింది మొదటి చెట్టు. ఆ పిట్ట చిన్నబుచ్చుకుంది. నిరాశగా రెండో చెట్టు దగ్గరకు పోయి సహాయం కోసం వేడుకుంది. "సరే ", అంది రెండో చెట్టు. మహదానందంగా ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలు పెట్టింది. వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది. పిట్ట, పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది. ఈలోగా వర్షాకాలం వచ్చింది అంతలో పెద్ద వర్షం. వర్షం పెద్దదైంది. వరద రావడం మొదలైంది. ఆ వరదలో మొదటి చెట్టు కూకటి వేళ్ళతో సహా కూలి పోయి, నీటిలో కొట్టుకుని పోతోంది. ఆ దృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పిట్ట చూస్తూ, "భగవంతుడు నీకు శిక్ష వేసాడు. నాకు సహాయం చేయడానికి నిరాకరించావుగా", అంది నవ్వుతూ. "నేను బలహీనమైనదానినని నాకు తెలుసు. వరద వస్తే కొట్టుకుని పోతానని కూడా తెలుసు. నాతో పాటు నీ గూడు కూడా కొట్టుకుపోకూడదనే నువ్వు గూడు కట్టుకునేందుకు నిరాకరించాను నేను. నన్ను క్షమించు. నువ్వు పది కాలాలు సుఖంగా ఉండు", అంది ఆనందంగా. ఆ చిన్న పిట్ట చిన్ని గుండెలో సముద్రమంత ఆవేదన. నీతి: ఎవరైనా నిరాకరిస్తే వారిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. వారి పరిస్థితి ఏమిటో వారికే తెలుస్తుంది. ఓర్పు ఒక్కటే సంబంధ బాంధవ్యాలను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది. చూసారు కదా ఆ చిన్న పిట్ట మొదటి చెట్టును తప్పుగా అర్థం చేసుకుంది. కానీ ఆ చెట్టు నేను ఉండను అని తెలిసి కూడా ఆ నిందను తన మీద వేసుకొని ఆ పక్షిని రక్షించింది. కాబట్టి మనం ఇతరులు చెప్పే విషయాలను , అర్థాలు అని కూడా పరమార్థాలు గా భావించాలి తప్ప తప్పు గా అనుకోకూడదు. అంత విధి నిర్ణయం అనుకోవాలి అపుడే అంత మంచి జరుగుతుంది. మిత్రమా సేకరణ... ఎక్కడి నుండి వచ్చిందో ఈ పోస్ట్ కానీ హృదయాన్ని తాకింది అందుకే ఇంత అందంగా తయారు చేసి పెడుతున్న చదివిన మీకు కూడా నచ్చింది అనుకుంటున్న మిత్రమా .. మరొక్క మంచి విషయం తో మీ ముందు ఉంటాను. జై భారత్. జై హింద్
like shere follw comment
నేను సాయిరామ్ మరొక మంచి పోస్ట్ తో మళ్ళీ వస్తాను

ప్రతి ఒక్కరు చదవండి

ప్రతి ఒక్కరు చదవండి

ఓ సైనికుని లేఖ

నాకు బాగా నచ్చిన పోస్ట్

మీరుకుడా చదవండి

ఓ సైనికుడి లేఖ.. మనిద్దరమూ 18 వ ఏటే ఇంట్లోంచి బయటకు వచ్చాం... నువ్వు నీ JEE క్లియర్ చేశావ్...నేను NDA కు సెలక్ట్ అయ్యాను... నువ్వు ఐఐటి లో చేరావ్...నేను అకాడమీ లో చేరాను... నువు డిగ్రీకోసం రేయింబవళ్ళూ కష్టించావ్... నేను ప్రపంచంలోనే అత్యంత కఠిన పరిస్తితుల మద్య ట్రైన్ అయ్యాను... నువ్వు బి.టెక్ పూర్తి చేశావ్... నేను కమీషండ్ ఆఫీసర్ అయ్యాను... నీకు రోజూ ఉదయం 7 తో మొదలయ్యి సాయంత్రం 6 తో ముగుస్తుంది .... నాకు ఉదయం 4 తో మొదలయ్యి రాత్రుళ్ళు కూడా శిక్షణ పొందాల్సి ఉంటుంది...
నీకు కాలేజీ లో స్నాతకోత్సవం ఉంటుంది ... నాకు పాసింగ్ ఔట్ పెరేడ్ ఉంటుంది.. నువ్వు బెస్ట్ కంపెనీలో బెస్ట్ ప్యాకేజీతో చేరతావ్... నేను నా ప్లటూన్ లో భుజాన రెండు నక్షత్రాలతో చేరతాను.. నీకు ఉద్యోగం వచ్చింది....నాకు జీవన పరమార్ధం దొరికింది... ప్రతి సందర్భంలోనూ నువ్వు నీ నీకుటుంబాన్ని కలుస్తావు... నేను నా తల్లితండ్రులను చూసే సమయం కోసం ఎదురుచూస్తాను .. నువ్వు పండగలన్నీ ఆనందోత్సాహలతో జరుపుకుంటావ్...నేను నా సహచరులతో బంకర్లలో జరుపుకుంటాను..
మనిద్దరికీ పెళ్లయింది..... నీ భార్య నిన్ను రోజూ చూస్తుంది....నా భార్య నన్ను ఈరోజు ప్రాణాలతో చూస్తే చాలనుకుంటుంది.. నువ్వు బిజినెస్ ట్రిప్ కోసం విదేశాలు వెళ్తావ్... నేను దేశ రక్షణ కోసం సరిహద్దుకు వెళ్తాను.. మనిద్దరమూ తిరిగొస్తాము...
చాలా రోజుల తర్వాత చూసిన నీ భార్య కన్నీళ్ళు నువ్వు తుడుస్తావు.. నేను తుడవలేను... తనకు ఆత్మీయ కౌగిలి ఇస్తావ్..నేను ఇవ్వలేను... ఎందుకంటే .... నేను శవపేటికలో ఉన్నాను... నా చాతీ మీద మెడల్స్ ఉన్నాయ్..వాటి బరువుకు నేను లేవలేను.. నా మహాప్రస్థానానికి అమర్చిన శవపేటిక గుర్రపు బగ్గీ మీద నా జీవన సాఫల్యమైన '' భారత త్రివర్ణ పతాకంతో '' అందంగా చుట్టబడి ఉంది... ఆ గర్వించే క్షణాలు వదులుకొని నేను శవపేటిక లోనుంచీ బయటకు రాలేను....మాతృభూమి రక్షణలో నా జీవితం సార్ధకమైంది ... మళ్ళీ సైనికుడిగా నే పుడతాను ... నా జీవితం ఇంతటితో సమాప్తం ఎందుకంటే నేను సైనికుణ్ణి ...... అమరుడ్ని ..
నీ జీవితం ముందుకే వెళ్ళాలని ఆశిస్తూ ''నీ మితృడైన ఒక సైనికుడు '' .... భారత్ మాతాకి ... జై... జై హింద్
పుస్తకని మించిన మంచి స్నేహితుడు లేడు

భారతీయ మహాపురుషుడు



 భారతీయ మహాపురుషుడు

చేవెళ్ల కళాశాల విద్యార్థుల ర్యాలీ

subscribe తెలుగు వారి కోసం చేవెళ్ల న్యూస్ :-కేరళలో ఏ. బి.వి.పి. కార్యకర్తల పై జరుకుతున్న వివిధ దాడులను ఖండిస్తూ ఈ ...