29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

Google apps in telugu

తెలుసా మీకు?



గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్స్ ఎనో తెలుసా


మనం రోజూ వాడుతున్న ఫోన్ లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్‌లో 13లక్షలకు పైగా యాప్స్ ఉన్నాయట!
స్మార్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఓఎస్‌ను మొబైల్ కంపెనీలు నిక్షిప్తం చేస్తున్నాయి. వార్తలు తెలుసుకునేందుకో యాప్, ఆటలు ఆడేందుకో యాప్, రోజువారీ జమా ఖర్చులు రాసేందుకో యాప్ ఇలా గూగుల్ ప్లే స్టోర్‌లో లక్షల కొద్దీ యాప్స్ ఉన్నాయి. సందర్భానికి, అవసరానికి తగ్గట్టు గూగుల్ యాప్స్‌ను అభివృద్ధి చేసింది. దీంతో ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్న ఫోన్లు కొనేందుకు యువత
మక్కువచూపుతున్నారు. 
అంతేకాకుండా ప్లే స్టోర్ నుంచి ఉచిత డౌన్ లోడ్ సౌకర్యం కూడా ఉండడంతో ఈ సౌకర్యమున్న ఫోన్లపైనే అందరూ ఆసక్తి చూపుతున్నారు. యాపిల్, విండోస్, సింబయాస్ వంటి ఓఎస్‌లు కలిగిన ఫోన్లలో యాప్స్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు పెద్దగా లేదు.
దీంతో ఆండ్రాయిడ్ ఫోన్లవైపు యువత మొగ్గుచూపుతున్నారు.
  గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న 13 లక్షలకు పైగా ఉన్న యాప్స్‌లో 11 లక్షల యాప్స్ మాత్రమే నాణ్యమైనవని గూగుల్ పేర్కొంది.
అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ గ్రేడ్ అయిన ప్రతిసారి లక్షల కొద్దీ కొత్త యాప్స్ వచ్చి చేరిపోతుంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

చేవెళ్ల కళాశాల విద్యార్థుల ర్యాలీ

subscribe తెలుగు వారి కోసం చేవెళ్ల న్యూస్ :-కేరళలో ఏ. బి.వి.పి. కార్యకర్తల పై జరుకుతున్న వివిధ దాడులను ఖండిస్తూ ఈ ...